బాల వ్యాకరణం--డా.కె.ఎల్ .వి.ప్రసాద్ ,--హనంకొండ ,వరంగల్.

తప్పును 
తప్పని 
చెప్పకుంటే ,


ఒప్పును 
ఒప్పని 
మెచ్చుకోకుంటె ,


గారాభం 
మత్తులో ..
పిల్లవాడి 
ప్రతిచేష్టకు ,
సానుకూలంగా 
స్పందిస్తే,


పసికందులు 
ఏడుపును 
ఆయుదంగా 
చేసుకుని ...
అనుకున్నవి 
సాధించుకుంటారు !


ఇది ప్రేమని ,
అనుకుంటె ,
మొక్క ముదిరి ,
మ్రానైనట్టు,
మంకు పట్టుతో ,
మొండివారు 
కావడం ఖాయం !


పిల్లవయసులోనే ,
తల్లిదండ్రులు ,
ఇదితెలుసుకోడం ,
      న్యాయం !!