మా ..పాప ..: ---డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,--హనంకొండ .: ఫోటో : బేబి నిహార.కానేటి(హనంకొండ): బాబు.రాహుల్.కానేటి(బోస్టన్)

ఆడపిల్ల 
పుట్టిందని తెలిసి ,
ఆనందం పట్టలేక 
ఎగిరి గంతేసాను .!


మానుకోటలో 
గోల్కొండ పట్టుకుని ,
గుండెల్లో ఎగిసి పడుతున్న ,
సంతోష వేగంతో ..
బండి వేగం కలిసిరాక ,
విసుక్కుంటూ ...
గొణుక్కుంటూ ...
ఎలాగో ..
బెజవాడలో పడ్డాను !


ఆకాశంలో ఎగిరానో ,
ఆటోలో వెళ్ళానో ...
ఆగమేఘాలమీద ,
అమెరికన్ ఆసుపత్రికి ,
చేరుకున్న ....
అత్రంగా అమ్మాయిని ,
తడిమి ..తడిమి చూసుకున్న ,
తండ్రి స్పర్శకి 
కళ్లుతెరిచిన మాపాపను చూసి,
పోలిక అక్షరాల 
నాదేననుకుని ....
గొప్పగా సంబరపడ్డా !


మెరుస్తున్న కళ్లు ,
ముచ్చటగా ..
మేను ఛాయ ...
ముద్దు ముద్దుగా 
చక్కని చిరునవ్వు ...
నా ..భవితకు 
నా ..పాపే రక్షకురాలు 
అన్న భావన ..
అప్పుడే కుదిరిపోయింది 
నాకు ....!


నా ..పాప ,
నాకో ...ముద్దుల 
మానవరాలినిచ్చిన 
మాతృ మూర్తి ఇప్పుడు !
ఇంటా _బయటా 
బాధ్యతలు మోస్తున్న ,
మా రక్షకురాలిప్పుడు !!
**
డాటర్స్ ..డే ,సందర్బంగా 
మనసులోని మాట **


   


కామెంట్‌లు