తెలంగాణ భీష్ముడు ఆదిరాజు వీరభద్రరావు: ---.జాధవ్ పుండలిక్ రావు పాటిల్--9441333315,భైంసా,నిర్మల్ జిల్లా

ఆదిరాజు వీరభద్రరావు ప్రముఖ చరిత్ర ,సాహిత్య పరిశోధకులు.ఖమ్మం జిల్లా మధిరి తాలూకాలోని వెందుకూరు గ్రామంలో ని బ్రాహ్మణ కుటుంబలో 1890 నవంబర్ 16 న లింగయ్య వెంకమాంబ దంపతులకు జన్మించారు.వీరభద్రరావు చిన్నప్పుడే  తండ్రి ని కోల్పోయాడు. తల్లి తన కుమారుని ఉన్నత విద్యాభ్యాసం చేయించింది.చదువు పూర్తి చేసిన వీరభద్రరావు హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ హైస్కూల్ ప్రధాన తెలుగు పండితుడుగా పనిచేశారు.హైదరాబాద్లోనే స్థిరపడ్డారు.హైదరాబాద్ ఆకాశవాణిలో తొలి ప్రసంగం చేశారు.లక్ష్మణరాయ పరోశోధక మండలి కార్యదర్శిగా వ్యవహరించారు. చరిత్ర రచనాకళలో ప్రామాణిక స్థాయిని అందుకున్నారు.ప్రాచీనాంధ్ర నగరములు ,లలిత కథావళి ,రత్నప్రభ ,జీవిత చరితావళి ,జీవిత చరిత్రలు ,నవ్వుల పువ్వులు ,మిఠాయి చెట్టు ,షితాబ్ ఖాన్ వంటి అనేక రచనలు చేశారు.గ్రీకు పురాణకథలు వ్రాశారు.సంగ్రహాంధ్ర విజ్ఞానకోశంలో యాభై వ్యాసాలు రాశారు.ఆయన తన పాండిత్య ,పరిశోధనలతో తెలంగాణ భీష్ముడిగా పేరం పొంది 1973 సెప్టెంబర్ 28 న తనను చా‌లించారు.
.


కామెంట్‌లు