వచ్చేస్తుంది
వేసవికాలం
వేగంగా ....
బాహువేగంగా !
శీతాకాలాన్ని ...
తరిమి ..తరిమి
శరవేగంగా ...
వచ్చేస్తుంది ,
ఎండాకాలం ...!
రగ్గులు -రజాయిలు
స్వేట్టర్లు -మఫ్లర్లు ...
దుప్పట్లు -శాలువాలు
బీరువాలోకి .....
పంకాలూ -కూలర్లు
ఏ .సి.లు -
విసనకర్రలు ....
పనిలోకి వచ్చేస్తాయ్ ,
చెమటలు -చిరాకు
పడే మనుష్యులకు
ఎంతో సేదదీరుస్తాయ్ !
పండ్లలో మహారాజు
మామిడి పండ్లు
మండే ఎండల్లోనే లభ్యం !
రసాలూ -బంగిన పల్లి
నాకెంతో ఇష్టం ,!
ఆ ..రోజుకోసం ..
ఎదురుచూడ్డం ...
నాకు మరీ ..మరీ ..ఇష్టం !!
------------------------------------
.ఫొటో లో: మామిడి పళ్లతో...
ఆన్షి.నల్లి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి