కాలువా గట్టున కదలి పోతుంటేను..నేను
నీళ్లులోని చేప నిక్కీ ....నిక్కీ చూచిందీ ...నన్ను
ఎగిరెగిరి చూస్తావు ఏమమ్మా ...నీవు
గాలమేస్తే ....నీవు గతుక్కు మంటావు గదవమ్మా ...అంటి..
నింగిలో చుక్కా లైనారు నీయట్లవారు
గాలిలో నేను గజమెత్తు ఎగురుతా
నేలపై నీవు నా ఎత్తు ఎగురు తావా ...అంది చేప
దంబాలెన్నో దంచి పోశావు
దాచుకో నీళ్లల్లో దయ్యాలు వస్తా యంటి.. నేను
చేతగాని వారికి చేష్టలూ.. మెండూ
మాటకారితో నాకు మాటలూ ఏలందీ.... చేప
గొప్పను చూచే గౌరవం లేదు ..నీకు
గోటివంటి నీకు గొప్పలూ ఏలంటి ..నేను .. గొప్పలు ఏలంటి నేనూ
గద్దలుతిరిగే వేళా నీవు .. ఒద్దికగా వుంట మేలు ...
లేనిగొప్పకు పోతె నీవు ...
లేపుక పోతుందీ ... గద్దనిన్ను ... అంటి నేనూ
మిడిచి పాటుతోడ ...అది ..మించి ఎగిరిందీ
దర్పంతో అది... దడి దాటి ఎగిరిందీ..
గట్టున పడిచేప గిలగిల కొట్టిందీ
మంటిలో దడదడా ఎగిరిందీ...చేప
అంతలో గద్ద రయమున వచ్చిందీ..
రాహువోలే వచ్చిందీ ...వేగాన ..గద్ద
ముక్కున గరచుకొని .చేపను .. గుటుక్కున మింగిందీ ....
దిక్కులచూచి... టపటప చాచి రెక్కలు
చటుక్కున ఎగిరిందీ..గద్ద ..
మంచి సుద్దుల మనసు నింపి
అహంకారం అణచిపెట్టీ .. .అరిగే వారికి
అడ్డులేని ఆనందం.. భువిని
అమరినిండు అంతమెరుగక అవని....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి