ఎప్పుడూ పుస్తకాలు ముందు పెట్టుకొని అదే పనిగా చదువును కొనసాగిస్తే ఆ చదువు ఆ విద్యార్థులకు పెను భారంగా మారుతోంది. మానసిక ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగాచదివిన చదువు శూన్యమనిపిస్తుంది.అలా కాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుండగలదో
చెప్పే గేయకథే "కొత్త ఊపిరి"!//అర్ధరాతిరి వరకు/
చదివి చదివీ చదివి/వేకువన లేచాడు/మరల
చదవగ వేణు//పొత్తములు మూసేసి/చదివినది
తలచాడు/గుర్తేది రాకను/తెగ కృంగి పోయాడు//
మనవ డేడ్పును విని/తాతయ్య వచ్చారు/
కారణం తెలుసుకొని/కడు జాలి పడ్డారు//వెంటనే
మనవడిని/మేడ నెక్కించారు/పరిసరాల నొక పరి/చూడమని కోరారు//కొండలూ గుట్టలూ/
వేణు నలరించాయి/పచ్చనీ తోటలూ/కనువిందు
చేశాయి//లేలేత సూరీడు/మెల మెల్ల గొచ్చాడు/
రంగుల్ల మబ్బులతొ/సంతోష పరిచాడు//
నింగిలో పక్షులు/కలకలము చేశాయి/చెట్ల మీదను
వాలి/ముదము చేకూర్చాయి//వేణు వాటిని చూసి/మైమరచి పోయాడు/తానేడ్చు విషయమును/పూర్తిగా మరిచాడు//అది మంచి
సమయమని/తాతయ్య తలచారు/మనవడిని
ఈ తీరు బుజ్జగించారు://" ప్రకృతిని చూడగా/
పరవశించెదము/అలసటను మైమరచి/ఉత్తేజ
మొందెదము//" ఆటపాటలు,కళలు/ఒత్తిడిని
పోగొట్టు/చదువుతో పాటుగా/ఇవియన్ని పాటించు//" కొనసాగ గలదపుడు/నీ చదువు
దర్జాగ/బేజారు పడదపుడు/నీ మెదడు పిచ్చిగ"//
తాత చూపిన బాట/మనవడు పయనించె/కొత్త
ఊపిరి తోడ/చదువులో రాణించె//ఈ గేయకథ
2018 డిసెంబర్ కొత్తపల్లి అనే పత్రికలో వచ్చింది.
కొత్తపల్లి పత్రిక లో పిల్లల రచనలే ఎక్కువగా
ఉంటాయి. పెద్ద వారివి చాల తక్కువగా ఉంటాయి. పిల్లల మానసిక వికాసానికి ఈ పత్రిక
బాగానే తోడ్పడుతుంది.(సశేషం)
225.విద్యార్థుల ఒత్తిడి ఎలా పోతోంది:-బెలగాంభీమేశ్వరరావు,9989537835.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి