-నేను---నా బాలసాహిత్యం (60) 5- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి--ఫోన్ : 7013660252.

 నేను రాసిన కథలు బాల తేజం, బాలమిత్ర, వార్త , బాల భారతం, బాల బాట, శ్రీవాణిపలుకు,ధ్యానమాలిక, హాస్యానందం, భక్తి సమాచారం, ధర్మ శాస్త్రం, ఉజ్వల, ఆశ, చంద్రబాల, ఆటవిడుపు మొదలగు పత్రికలలో రమారమీ 180 కథలు ప్రచురితమయ్యాయి. బాల గేయాలు 650 కి పైబడి పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ప్రౌఢ సాహిత్యంలో 80కి పైగా కవితలు ప్రచురింప బడ్డాయి. ఆంగ్ల భాషలో సుమారు 150 రచనలు ప్రచురింపబడ్డాయి. " విశ్వ ప్రభ " అనే కవితా శీర్షికతో పుస్తకరూపంలో వచ్చిన కవితలు 60 వరకు ఉన్నాయి. బాల  సాహిత్యంలో బాల గేయాలు 120 వరకూ ఉంటాయి. అవే " బాలప్రభ " ,   “ వెన్నెల ” అనే పుస్తకాలుగా ప్రచురింపబడ్డాయి. కథల విషయానికొస్తే బాలసాహిత్యంలో" బంగారు చేప" నక్క జోస్యం, పిల్ల కాకి అల్లరి,  విక్రమార్కుని సింహాసనం, బాలకథాప్రభ కథల సంపుటాలు ప్రచురింపబడ్డాయి. ఇవిగాక ప్రముఖ బాలలగేయ రచయితల బాల గేయ సంకలనాలు --  గోగుపూలు, గులాబీలు, మల్లెమొగ్గలు, సిరిమల్లెలలో ప్రచురింపబడ్డాయి. ఇక ప్రముఖ కవుల కవితా సంకలనాలు అయిన --అవినీతిపై అస్త్రం, అపురూపం, అవ్యక్త , కవితోత్సవం, కోట కవితలలో  నాచే వ్రాయబడ్డ కవితలు చేటుచేసు కున్నాయి. కథలు విషయానికొస్తే " నేను సైతం, నాకు నచ్చిన కథ " కథా  సంకలనాలలో చోటు  చేసుకున్నాయి. కేంద్ర సాహిత్య అకాడమీ బెంగళూరు శాఖవారు విశాఖపట్నంలో నిర్వహించిన సెమినార్ లో

 “ బాల సాహిత్యం నీతి బోధక నాటికలు ” ద్వారా బాలలకు నీతిని ఎలా బోధించాలి అనే అంశంపై ప్రసంగించి పరిశీలన పత్రాలను కేంద్ర సాహిత్య అకాడమీ వారికి సమర్పించాను. నాచే వ్రాయబడ్డ “  చెడు స్నేహం” అనే బాలల నీతి కథను కేంద్ర సాహిత్య అకాడమీ వారి కథా సంకలనంలో ప్రచురించేందుకు ఎంపిక చేయబడింది. గౌరవ పురస్కా రాలు, బిరుదుల విషయానికొస్తే 1996 - 97 సంవత్సర ములో నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బలిజిపేటలో ప్రధానోపాధ్యాయులు  ఎఫ్ ఏ సి గా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమంలో జిల్లాస్థాయిలోను రాష్ట్ర స్థాయిలో ప్రధమ బహుమతులను రవీంద్ర భారతి హైదరాబాదులో ఆనాటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడి గారి చేతుల మీదుగా పొందడం జరిగింది.

 03 - 03 - 2001న బలిజిపేట ఉన్నత పాఠశాలలో జరిగిన గోల్డెన్ జూబ్లీ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు. 2005 సంవత్సరంలో జై హింద్, స్టేట్ ఎక్స్ప్రెస్, వేదులహరి పత్రికల యాజమాన్యాల వారిచే ఉగాది పురస్కారాలు పొందాను. 30-03-2006, 20-03-2007, 10-4-2008 వరుసగా మూడు సంవత్సరాలు

రైటర్ పక్ష పత్రిక యాజమాన్యం వారిచే సన్మానింపబడ్డాను. బొబ్బిలి వివర్ధినీ సాహితీ సాంస్కృతిక సంస్థ విద్యార్థిని సాహితీ పురస్కారం నగదును పొందాను. ఆగస్టు 2008 లో మదర్ థెరిసా పౌండేషన్ ఆర్గనైజేషన్ విశాఖపట్నం గారిచే సన్మానం, ఆణిముత్యం బిరుదును పొందడం జరిగింది.08-09-2008లో సీతానగరం ఉన్నత పాఠశాల వారిచే  సన్మానిం పబడి " ప్రజాకవి" అను బిరుదును పొందారు.21-06-2010లో నాచే వ్రాయబడిన "వెన్నెల " బాలగేయాల సంకలనాన్ని బొబ్బిలి కళాభారతిలో  ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వారిచే ఆవిష్కరింపజేసి నన్ను సత్కరించారు. 07-10-2011న నాచే వ్రాయబడిన " బాల కథ ప్రభ ” బాలల కథా సంకలనాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారు, బాల సాహిత్య పరిషత్తు హైదరాబాద్ వారు, సత్యమూర్తి చారిటబుల్ ట్రస్ట్ విశాఖపట్నం వారు సంయుక్తంగా ఆంధ్ర యూనివర్సిటీ విశాఖ ప్రాంగణం నిర్వహించిన కార్యక్రమంలో పుస్తకావిష్కరణ చేసి నన్ను సత్కరించారు. 2010 నవంబర్లో ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ విజయనగరం జిల్లా శాఖ వారు సాహితీ రంగంలో కృషి చేసినందుకు నన్ను సత్కరించారు.  ( సశేషం )