సాక్షి శతకము: బెహరా ఉమామహేశ్వరరావు: -సెల్ నెంబర్-9290061336

 సర్వవ్యాపకుడవు గద/
యుర్విని నా మొర యొకింతయుడపగ లేవా/
సర్వము నీవని నమ్మితి/
సర్వాత్మక లక్ష్మి రమణ స్వామీ సాక్షీ//(10)
 రాముడవన్నను, ఆత్మా/
రాముడవన్నను అనంత రమ్యుడవన్నన్/
పామర గుణ రహితుండవు/
కామ జనక సిరులొసంగి గావుము సాక్షీ//(11)
పలికెడి పలుకులు నీవే/
తిలకింపగ తెలివి నీవే తలుపులు నీవే/
సలలిత ఆత్మవు నీవే/
కలిమియు బలమెల్ల నీవే క్రమమిది సాక్షీ//(12)
చక్కని వాడవటంచును/
పెక్కగు గ్రంధంబులందు ప్రత్యక్షముగా/
ఎక్కువుగ వ్రాసి యుండిరి/
నిక్కము నీ దరిశనంబు నెపుడగు సాక్షీ//(13)
నిత్యానంద పరాత్పర/
సత్యాశ్రయ సత్యనిలయ సత్య ప్రకాశా/
గత్యంతర మీవె గదా/
ప్రత్యక్షముగమ్ము వేగ ప్రేమను సాక్షీ//(14)