నరస నాయకులకు నాగలాదేవికి పుత్రుడై జనియించేసాహితీ సమరాంగణ సార్వభౌముడితడుతుళువ వంశంలో వెలిగే శ్రీ కృష్ణ దేవరాయలురాయలేలిన సీమ రతనాల సీమయనిఅంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచ్చటపాడిపంటలు, పసిడి రాసులతో తులతూగిన స్వర్ణయుగంభువన విజయం సభా భవనాన అష్ట దిగ్గజ కవులనాదరించేమంత్రి తిమ్మరుసును "అప్పాజీ" యని ప్రేమతో పిలిచి గండ పెండేరం తొడిగేనుఆంధ్ర భోజుడుగా, కన్నడ రాజ్యరమారమణ' గా కీర్తింప బడినాడువిజయనగర సామ్రాజ్యం రాయల పాలనలో స్వర్ణ యుగం అయ్యెనుఆంధ్ర భోజుడు రాసే ఆముక్త మాల్యదనుసత్య వధూ ప్రీణనము, మదాలస చరిత్ర,రస మంజరి, సకలకథాసార సంగ్రహముకళలకు కాణాచియని, ప్రబంద యుగమనిరి రాయలవారి సామ్రాజ్యంతెలుగు సాహిత్యాన తేజము నింపెనుదేశ భాషలందు తెలుగు లెస్స యని పలికెతిరుమల శ్రీనివాసునకు పరమ భక్తుడువిజయ నగరాదీశులందరిలో గొప్పవాడురాజనీతిజ్ఞుడు, భుజబల సంపన్నుడుఅనేక శైవ, వైష్ణవాలయాలను నిర్మించేకొట్టూరు లో తన విజయాలకు నిదర్శనమైన స్తూపం నిక్కమై నేటికీ నిలబడియున్నదిచరిత్రలో మీ కీర్తి సువర్ణ విరచితం, సూర్య చంద్రులు ఉన్నంతవరకు అజరామరం.
సాహితీ సమరాంగణ చక్రవర్తి:---వేముల ప్రేమలత --హైదరాబాద్