మా అమ్మకు రెండు - మా నాన్నకు రెండునాకేమొ బోలెడు - నాకేమో బోలెడు !మాఅన్న చూశాడంటే - లాగేసుకుంటాడుమాఅక్క చూసిందంటే - లాగేసుకుంటుంది !మాచెల్లి చూసిందంటే - బాగా ఏడుస్తుందిమాతమ్ముడు చూశాడంటే - బాగా ఏడుస్తాడు !అందరికీ కావాలంటే - కావాలండీ బోలెడునాదగ్గర ఉన్నాయండీ - ఒకేఒక సోలెడు !!
పల్లీలు: - :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి