ఈ రోజే ఉదయం వారు ప్రయాణం ప్రారంభిచారు. ఎక్కడికో చెప్పనే లేదు కాదు.న్యూజిలాండ్ రాజధాని నగరమైన విల్లింగ్టన్ కు. కార్ లో వెళుతున్నారు. అక్కడికి ఎనిమిది గంటల డ్రైవ్ , అందుకే ఈ రోజు ముందు హామిల్టన్ లో ఒక స్నేహితుడిని కలిసి టౌపో కు చేరుకుంటారు. అక్కడ ఈ రోజంతా వుంటారు, చూడాల్సిన ప్రదేశాలు చూస్తారు.. రేపు అంటే 27వ తేదీన టౌపో నుంచి బయలు దేరి విల్లింగ్టన్ చేరుకుంటారు అక్కడ 28 న ఉండి 29 నాడు రొటోరు చేరుకొని మరునాడు అంటే 30 వ తేదీ రోజు ఆక్లాండ్ చేరుకుంటారు. ఇది వారి ప్రయాణ తీరు.ఆక్లాండ్ నుంచి విల్లింగ్టన్ కు కార్ లో సుమారు ఎనిమిది గంటల ప్రయాణం అందుకే మధ్య మజిలీలు ఏర్పాటు చేసుకుని ఆనందిస్తూ బయలు దేరడం, ఆద్యకు, ఆరియాకు కూడా బొర్ రాకూడదు. ఇక్కడ రోడ్ ప్రయాణం కూడా చాల సరదాగా ఉంటుంది. గంటకు వంద కిలో మీటర్ల వేగం తో వెళ్ళాలి. మధ్య మధ్యలో సేద తీరడానికి ప్రదేశాలు ఉంటాయి, అక్కడ మాత్రమే కార్ ఆపాలి ఇష్టం వచ్చిన చోట కార్ అపి కాల కృత్యాలు తీర్చుకోవడం నేరం, మనం ఎక్కడ ఏ వేగం తో వెళ్లాలో రోడ్ల పక్కన బోర్డు లు రాసి ఉంటాయి. వాటిని పాటిస్తుండాలి. ఇవన్నీ కెమెరాలు రికార్డు చేస్తాయి. అంటే మనం ప్రయాణిస్తున్నంత సేపు పోలీస్ లు మనలను వెంటాడుతున్నట్టే. కదా.నిన్నంతా ఆద్య తాము టూర్ వెళుతున్నట్టు అందరితో చెబుతూ మురిసి పోయింది. ఇక ఆరియా ఒక సాహసం చేసింది. ప్రతిదీ ఆమె పరిశీలనగా చూస్తుంది నిన్న ఫ్యాన్ వద్దకు వెళ్లి తిరుగుతున్న ఫ్యాన్ లో చేయి పెట్టింది . కానీ వెంటనే తీసింది, దీంతో పెద్ద ప్రమాదాన్ని తనకు తానె తప్పించుకుంది. చర్మంపై సూది కూచుకున్నట్టు మాత్రమే గాయమై రక్తం వచ్చింది. కానీ సాయంకాలం వరకు తగ్గింది. ఇంటికి వచ్చిన వారందరికీ తన గాయం చూపించుకుంది.(మిగతా ముచ్చట్లు రేపు )
'ఆ' ఇద్దరు : టి. వేదాంత సూరి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి