చిన్న పిల్లలకు సత్వర శక్తికి-- రుచికరమైన పానీయం..: పి . కమలాకర్ రావు

 కొన్ని ఎండు ఖర్జూరాలను లోపలి గింజలు తీసి ముక్కలుగా చేసి,  జీడిపప్పు, బాదాం పప్పులతో పాటుగా నేతిలో వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడిని పాలలో వేసి మరిగించాలి. తాటి కలకండ, లేక బెల్లాన్ని తగినంత కలపాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకు త్రాగించాలి. ఇది శరీరంలోని అన్ని భాగాలకు మంచి శక్తినిస్తుంది ఉత్సాహన్ని  ఇస్తుంది, చురుకుదనాన్ని కూడా ఇస్తుంది. ఇది త్రాగడానికి రుచిగా ఉంటుంది కాబట్టి పిల్లలు దీనిని ఇష్టపడతారు.