శ్రీ కృష్ణ శతకము - పద్యం (౬ - 6)

 కందము :
*చిలుక నొక రమణి ముద్దులు*
*శ్రీరామయనుచు | శ్రీపతి పేరుం*
*బిలిచిన మోక్షము నిచ్చితి*
*వలరగ మిము దలఁచు జనుల | కరుదా కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
ఒకానొక చక్కని రమణీమణి తనకంటే అందమైన తన చిలుకను *"శ్రీరామా"* అని పిలుచుకునేది. *"శ్రీరామ"* అని చిలుకను పిలిచినందుకే ఆ రమణీమణికి మోక్షాన్ని ఇచ్చావు.  రమణీరమణా, నీ పేరును కేవలం తలచినంత చేతనే మోక్షం ప్రసాదిచగలవాడవు నీవు. నీ ప్రాపున వున్నవాళ్ళకు, మోక్షం కరతలామలకమే. చాలా తేలిక అయిన విషయం....అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు
*నామ స్మరణ మహిమ ఇంత అని చెప్పటం ఎవరి వల్ల కాదు.  నామాన్ని ఎంత ఆర్ద్రతతో పలికాము, మనసుకు పట్టించుకున్నాము అనేదే ముఖ్యము. "అంతయు నీవే హరి పుండరీకాక్ష, చెంత మాకు నీవే శ్రీ రఘురామా!"* అంటూ ముందుకు సాగుదాము.
 
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు