పలుకవే మా రామచిలుకా (బాల గేయం ):-- ఎం. వి. ఉమాదేవి -7842368534

 పచ్చ పచ్చని చిలుక 
పాప మెచ్చిన చిలుక 
చెలికలో  బంగారు మొలకా!
పలుకవే మా రామచిలుకా!
చెట్టుపై నువ్వు కులుక
గట్టి పండును కొరక
తీయదనమే వొలుక
కిలకిలా పాప లిక!
పలికేవు మా రామచిలుకా!
ఎదుట నిలిచేవు బంగారు మొలకా!

మోహనమ్ముగ నీకు 
పావనమ్ముగా రామ 
భద్రునీ పేరేల చిలకా? 
సీత కోకచిలుకలాగ కులుకా!
అంత ఎర్రనీ ముక్కేల చిలుకా!
వనసీమ అందాలు 
పక్షులకు బంధాలు 
కామాక్షి భుజంపై చిలుకా 
తల్లి గోదమ్మ హాసమే వొలుకా!