సాక్షి శతకము: - బెహరా.ఉమామహేశ్వరరావు-సెల్నెంబర్:9290061336


 జగమను నాటక శాలలో/

అగణితమగు వేషములను అందముమీరన్/

తగినట్లు వేసియుంటిని/

అగుపడనటువంటి మాయనంటియు సాక్షీ//(35)


మాయా తెర మధ్యను పడి/

ఆ యవ్యయములకు నర్తనాద్యంతములన్/

బాయక నటించి చూచితి/

ఈయవలసినది నిమ్ము యిరువున సాక్షీ//(36)