సాక్షి శతకము: - -బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబరు:9290061336


 గురుతెరిగిన నిజ భక్తుడు/

మరుగెల్లను గురునిజేరి మర్మమెరుంగున్/

గురు శిష్యుల సంబంధము/

పరమాత్మా జీవులనగబరగును సాక్షీ//(43(


   గురునింజేరక యుండిన/

   తిరమగునే అత్మనెరుగ తెరవేమైనన్/

   పరమ మునీంద్రులకైనను/

   తరమే నిజగురునిదెలియ ధోరణిని సాక్షీ//(44)