సాక్షి శతకం: -బెహరా ఉమామహేశ్వరరావు;-సెల్ నెంబరు:9290061336*


 ప్రాజ్ఞుడన  ప్రాజ్ఞుడనో/

యే  జ్ఞానము సరిగ లేదు ఎరుగని వాడన్/

ప్రాజ్ఞా ప్రాజ్ఞతలవి నీ/

యాజ్ఞను తలదాల్చి యున్న వందురు సాక్షీ//(67)


   ఉత్సాహము ఉపకారము/

   సత్సంఘము ప్రజ్ఞ యిలను సమభావంబున్/

   సత్యమను ఆరు గుణముల/

   తత్సత్తగు దానివలన ధరలో సాక్షీ//(68)


           

కామెంట్‌లు