సాక్షి శతకము:- -బెహరా ఉమామహేశ్వరావు సెల్ నెంబర్-9290062336.


               

అజ్ఞానాంధత చేతను/

విజ్ఞానము లేక వెర్రి వెంగలి వలెన్/ 

ప్రాజ్నులను దూలనాడి కృ/

తజ్ఞత చెడి పోయె నన్ను గావుము సాక్షీ//(39)

    దేవా నీ దయ నాపై/

    రా వేగమె ముందు నాదు జ్ఞాన సునేత్రం/

     బీవే తెరవుము తండ్రీ/

     ఆ వెనుకను ఆత్మ బుద్ధి అరయును సాక్షీ//(40)