యువత మేలుకో-మంచిని పెంచుకో:.డా.తెలుగు తిరుమలేష్--తెరసం జిల్లా అధ్యక్షులు 9908910398


 ఓ యువత నీవు మేలుకో...

నీలోని మంచిని పెంచుకో...

అసహనం నీ దరి చేరానీయకు..

భయం నీ ఒడిలోకి రానియకు...

కష్టాలకు కన్నీళ్లను కార్చకు...

సమస్యకు  పరిష్కారం  వెతుకు...

నీ గతం గొప్పది...

నీ సంప్రదాయం గొప్పది...

కాని వర్తమానం ఇబ్భందిగా ఉండవచ్చు...

సవరించుకుంటే ...

నీ భవిషత్తును బంగారంగా మార్చుకోవచ్చు...

ఓ యువత ఆత్మ న్యూనత వదులు...

ఆత్మ గౌరవంతో మెలుగు...

ఆత్మవిశ్వాసంతో పనులను ప్రారంభించు...

అపరిమితమైన నీ బోధనలతో సమాజాన్ని ప్రభావితం చేయవచ్చు..

ఆధ్యాత్మికలకు హద్దు ...

మానవత్వమే ముద్దు అన్ని గ్రహించు..

తలెత్తి ఠీవిగా బ్రతకడం నేర్చుకో...

పిరికి పందలాంటి ప్రయత్నాలు మానుకో...

కలలు కనండి...

నీ మెదడు కండరాలు ప్రతిభాగం..

సమాజం హితం వైపు కదలాలి...

సమాజ గతిని మార్చాలి...

మీ శక్తి సామర్ధ్యాలను గ్రహించండి...

మీలోని శక్తిని ఈ విశ్వ ప్రయోజనాలకు ఉపయోగించండి..

ఆత్మ పరమాత్మల సారాన్ని తెలుసుకోండి...

సకాలంలో సత్కార్యాలను పూర్తి చేయండి...

గాలిలో దీపం పెట్టి దేవుడా అనకండి...

విలువైన జీవితాన్ని వ్యర్థం చేయకండి...

కలిసికట్టుగా పోరాడండి...

రాజకీయాలకు ఎర (బలి, వ్యసనం)గా మారకండి...

నాయకుడిగా ఎదగండి...

ఐక్యమత్యమే..మహాబలమని ఎరగండి..

తీసుకోవడంలో ఆనందం లేదు...

తిరిగి ఇవ్వడంలోనే నిజమైన ఆనందం ఉందని గ్రహించండి...

తిట్లను తిరస్కరించండి...

అవి తిట్టిన వారికే చేరుతాయి అని గ్రహించండి...

నీ పై విమర్శలు పెరిగాయి అంటే...

నీలో ఎదుగుదల మొదలైంది అని గుర్తించండి...

నా కోసం బ్రతకడం అనకండి...

మనకోసం బ్రతుకు పోరాటం అనండి...

యువకులారా మేలుకోండి !

అవినీతిని అరికట్టండి...

పేదరికాన్ని పెకిలించండి...

జనహితం,పరహితం,సమాజాహితంకోరి...

మంచి ఔన్నత్యంతో మెలుగండి...

సాధారణ పరిపూర్ణత మన జీవితం కాదు...

మన లక్ష్యంను గుర్తుంచుకోవడం మన జీవితం...

ఓ యువకులారా మేల్కొనండి !

అంతర్జాలంతో అర్థం కాకుండాపోతున్నావు...

సోదరుల పట్ల స్వభావాన్ని కోల్పోతున్నావు...

రంగుల చిత్రాలతో సినిఅభిమానులుగా మారుతున్నావు...

రాజకీయాలతో కుతంత్రాలకు  తలపడుతున్నావు...

పరస్త్రీల పట్ల పరమనీచంగా ప్రవర్తిస్తున్నావు...

కళాశాలలో కల్చర్ ను మరుస్తున్నావు...

కులమతాలతో  కంటగింపుగా మారుతున్నావు...

ఓ యువత మేలుకో...నీ గమ్యం చేరుకో...!

యువకులారా మేల్కొనండి శోదించండి...

మరణాన్ని గ్రహించండి...

జీవితం చిన్నదని బోధించండి...

ఓ యువకులారా !

అనంతమైన  అఖండమైన ఈ విశ్వములో...

ఆత్మ విశ్వాసం గొప్పదని  గ్రహించండి...

ఓ యువకులారా !

మంచిని పెంచు...

మంచిని బోధించు..

మంచిని పంచు...

మానవత్వంతో నడుచుకో...

యువకులారా మేల్కొనండి !

సేవాదృక్పథంలో ప్రయనిద్దాం...

సేవాభావంతో మెలుగుదాం...

-----

*యువకులందరికి జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలతో*...