భరత పుత్రుడా!(గేయ సూక్తులు):- డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల9948089819

 తూర్పు కొండల బాల భానుడు
తొంగి చూచెను కాంతి నిచ్చెను
వాని స్నేహము కోరి నడచిన
ప్రగతి నీదే  భరత పుత్రుడ!  18

 

వావి వరుసలు మరచి సాగిన
పాతకము కొని తెచ్చు కొనెదవు
పెదవి చాటున సుధా సూక్తులు
విరియ వలెనుర భరత పుత్రుడ! 19