భరత పుత్రుడా!(గేయ సూక్తులు):- డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల9948089819


 లలిత కోమల భావ కవితలు

రమ్య రీతిగ అల్ల వలెరా

కవిత లందున శాంతి స్వరముల

భవిత చూపర భరత పుత్రుడ!    26


చిరుత నవ్వుల తోట లందున

చిగురు మేసిన కొత్త కోకిల

నవ్య గీతిక పాడనున్నది

నవత కోరుము భరత పుత్రుడ!  27


  

కామెంట్‌లు