విశ్వనగర విలాపం:--డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి, సికింద్రాబాద్.9948285353.


 ఆకాశం రోదిస్తున్నది

గుండె పగిలి ఎడతెరిపి లేకుండా

జడివాన కురిపిస్తున్నది.

అవని నరుల వికృతులు చూసి

హృదయం బరువెక్కి

వెక్కి వెక్కి ఏడుస్తున్నది.

విశ్వనగర విలాపం ఆగకున్నది.

నాలాలు కుంచించుకు పోయినా,

చెరువులు పూడ్చివేయబడుతున్నా,

అడ్డదిడ్డమైన లేఅవుట్లు పుట్టుకొస్తున్నా,

శిఖాల్లో హర్మ్యాలు మొలుస్తున్నా,

రియల్టర్ల ఆగడాలు విలయాలు సృష్టిస్తున్నా,

రోడ్లకు రోడ్లే కొట్టుకుపోతున్నా,

ప్రజల అవస్థలు ఎవరికి కావాలి?

ప్రపంచసదస్సులకు మాత్రం

హంగులూ,ఆర్భాటాలు.

ఓట్లు అమ్ముకున్నంత కాలం

పాట్లు తప్పవు.

విచక్షణలేమి,పౌరనిస్పృహలే

పాషాణాలు సృష్టిస్తాయి.

విశ్వనగర విలాపం

పాలకుల శాపం

మోక్షం లేని యక్షప్రశ్నకు

బదులెక్కడ?

బాధ్యతెక్కడ?