'' ఆ'' ఇద్దరు : - టి. వేదాంత సూరి



 మేము ఆ మధ్య హామిల్టన్ బాలాజీ టెంపుల్ కు వెళ్ళినప్పుడు అన్న దానానికి మామయ్య డబ్బు చెల్లించారు అని చెప్పుకున్నాం కదా. మరి అందుకే అనూషత్త పుట్టిన రోజు కావడం తో అందరం రెండు కార్ లలో హామిల్టన్ వెళ్ళాం, ఈ రోజు అక్కడ గోదా కళ్యాణం జరిగింది. మేము వెళ్లడం కొంత ఆలస్యమైంది . అక్కడ పూజలు చేయించి, ప్రసాదాలు తీసుకుని బయలు దేరాం, 
సాయంకాలం పాపడం రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేసాం, ఇక్కడ  దక్షిణా భారత దేశపు  వంటకాలు దొరుకుతాయి. నెయ్యి దోస,ఫిల్టర్ కాఫీ తీసుకుని ఇంటికి చేరుకున్నాం. 
ఇక్కడ వాతావరణం ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. అవును మనుషులు కూడా, అందరు నిజాయితీగా అంతే స్వచ్ఛంగా వుంటారు. ఎక్కడా కల్మషం కనిపించదు. నిబంధనలు సక్రమంగా పాటిస్తారు, ఆద్య ఆరియా కార్ ఎక్కగానే బెల్ట్ పెట్టుకోవాలని గుర్తు చేస్తారు, అంటే చిన్నప్పటి నుంచే క్రమ శిక్షణ ఎలా అలవాటు అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి ఆహార పదార్థాలలో కూడా కల్తీ ఉండదు. డాక్టర్  వద్దకు వెళితే అనవసరపు మందులు రాసి మనపై ప్రయోగం చేయరు, లంచాలు, అవినీతి ఉండదు. దొంగతనాలు వుండవు. ఇంట్లో బట్టలు ఆరవేసుకుని బయటకు యెంత సేపు వెళ్లి వచ్చినా ఎవ్వరూ ముట్టరు. మన ఇంటిపై కన్నెత్తి చూడరు. 
ఇంతటి ప్రశాంతమైన , స్వచ్ఛమైన వాతావరణం లో జీవిస్తున్నందు వలన కావచ్చు చాల వరకు 95 ఏళ్ళు దాటిన వృద్దులు, హాయిగా తిరుగుతూ, వాకింగ్ చేస్తూ కనిపిస్తారు. మానసిక ఆందోళనలు కూడా వుండవు కదా. అందుకే ఆరోగ్యంగా వుంటారు. 
 అదే  విధంగా నా ఆద్య, ఆరియా కూడా ఆనందంగా హాయిగా, నిరంతర ఉల్లాసంగా నూరేళ్లు పై బడి వుండాలని మీరూ, నేనూ , మనమందరం మనసారా ఆశీర్వదిద్దాం . 
ఎన్నాళ్ళు గానో బాలలకు సీరియల్ గా నవల రాయాలన్న కోరిక ఉండేది. సందర్భాను సారం అవకాశం వచ్చింది, మీరంతా ఆదరించారు. అంతకన్నా కావలసింది ఏముంటుంది . మీ అభిమానాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఈ సీరియల్ ను ముగిస్తున్నాను. ధన్యవాదాలు 
-టి. వేదాంత సూరి 
కామెంట్‌లు