గృహస్థాశ్రమ ధర్మము కవిమిత్ర, శంకరప్రియ., శీల.,సంచార వాణి:- 99127 67098
\🚩బాలలకు వృద్ధులకు
 సమాశ్రయ మగునది
    "గృహస్థాశ్రమ ధర్మము"
 వినండి! విబుధులార!
          [అష్టాక్షరీ గీతి. శంకర ప్రియ.,]
👌"గృహస్థుడు"అనగా... ఇంటి యజమాని! కుటుంబమునకు పెద్ద! వ్యవహారజ్ఞానము, లోకానుభవము కలవాడు! "గేస్తుడు", "ఆతిధేయుడు".. అని, గృహస్తునకు పేరులు! 
     "గృహస్థధర్మం" అనగా గృహస్థులు ఆచరించునది.. సనాతనమైనది! అది.. తమకుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితము కాలేదు!  అతిథి అభ్యాగతులకు, ముముక్షువులైన సంన్యాసులకు ... ఇరుగు పొరుగు వారికి ఆశ్రయమై యున్నది!
👌గృహస్థాశ్రమ ధర్మమే .. బ్రహ్మచర్యం, వానప్రస్థం, సంన్న్యాసం... మున్నగు ఆశ్రమముల వారికి ఆధారమైనది! 
    కుటుంబవ్యవస్థ నుండి వచ్చిన, సంస్కార వంతులైన వ్యక్తులే.. మహాత్ములు, దేశ భక్తులు, సంఘ సేవకులు, ఉత్తమ పరివ్రాజకులు!
🚩సమస్త ప్రాణికోటికీ ప్రాణవాయువు ఆధారమై యున్నది! అదే విధంగా "గృహస్థాశ్రమ ధర్మము" అందరికీ ఆశ్రయమై యున్నది! చతుర్విధ ఆశ్రమవ్యవస్థలో శ్రేష్ఠమైనది!
🪷యథా వాయుం సమాశ్రిత్య          
  వర్తoతే సర్వజంతవః
     తథా గృహస్థ మాశ్రిత్య
  వర్తంతే సర్వ ఆశ్రమాః !
       ఇది సుభాషిత రత్నము! "మనుస్మృతి" లోని సుప్రసిద్ధమైన శ్లోకము! 

 🚩తేట గీతి పద్యం
  వాయువేరీతి జీవుల ప్రాణరక్ష
  కూర్చుచుండునో, ఆరీతి కూర్మి తోడ
  ఆశ్రమమ్ముల కన్నింటి కాశ్రయమ్ము
  ఆతిథేయుడై మన్నన లందుచుండు!
      (👌ఆతిథేయుడు = గృహస్థుడు)

     [ డా. శాస్త్రుల రఘుపతి.,]
        ***************"
      🚩 తేట గీతి పద్యం
ప్రాణవాయువే ముఖ్యంబు ప్రాణులకును
భోజనాదులు బ్రతుకంగ భువి చరించు
నాశ్రమంబుల నడిపించు నన్నిటిని, గృ
హస్థులన ప్రసిద్ధము గృహస్థాశ్రమంబు!

       [...విద్వాన్. పైడి హరనాథరావు.,]

కామెంట్‌లు