ఆడపిల్ల అయితే నేమి
ఇంట లేమి ఉంటే నేమి
లక్ష్మీదేవి కదా ఆమె
ఇక నీ ఇంట సిరులకు లోటేమి
కళకళ గలగల ఇంట నడుస్తుంటే
చిలకల పలుకులు పలుకుతుంటే
గడిబిడ చేస్తూ కదులుతుంటే
దడదడ మ0టూ దౌడు తీస్తుంటే
ఇంటికెంత అందం
మనషులకు బందం
మనసంతా ఆనందం
భవిష్యత్తు జయప్రదం
సంసారానికి ఆడపిల్ల
సంతానానికి ఆడపిల్ల
సంతోషానికి ఆడపిల్ల bu
సంపాదనకు ఆడపిల్ల
ఆపదలో ఆడపిల్ల
ఆదుకునే ఆప్తురాలు
కష్టాలలో కన్నెపిల్ల
కరుణ చూపే కాంతి రేఖ
ఆడపిల్ల: -కవిత వేంకటేశ్వర్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి