పులి చింతాకు రసం లో తేనె కలిపి త్రాగితే చిన్న పిల్లలకు విరేచనాలు తగ్గిపోతాయి.
పొట్లకాయ ఆకులను బాగా కడిగి దంచి రసం తీసి చిన్న పిల్లలకు త్రాగిస్తే కడుపులోని క్రిములను నాశనం చేస్తుంది. అదే రసాన్ని తలకు రాస్తే తల లోని పేలు రాలిపోతాయి. జుట్టు పెరుగుతుంది.
క్యాబేజీని గుజ్జుగా చేసి తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే తలలోని చుండ్రు తగ్గిపోతుంది.
బీట్రూట్ తురుము తీసి అందులో తాటి బెల్లం కలిపి నీరు పోసి ఉడికించి యాలకుల పొడి కలిపి పానకం గా తయారు చేసి చిన్నపిల్లలకి త్రాగిస్తే మంచి బలంగా తయారవుతారు, త్వరగా అలసిపోరు.
కస్తూరి పసుపు లో కొద్దిగా మీగడ కలిపి మిశ్రమంగా చేసి ముఖానికి పట్టిస్తే ముఖం మీద నల్ల మచ్చలు పోతాయి. ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
కొన్ని చిట్కాలు... : పి . కమలాకర్ రావు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి