సంక్రాంతి బాలగేయం: -మమత ఐల-హైదరాబాద్


 బాలల్లారా రారండి

రంగవల్లులు చూడండి

అందమైన ఈ ముగ్గులలో

గొబ్బెమ్మలను పెట్టండి


భోగి మంటలు వేద్దామా 

చల్లని చలి తరిమేద్దామా

భోగి పళ్ళను పోసుకుని

నారాయణున్ని శరణందామా


పతంగులను కొని తెద్దామా

పైపైకి ఎగరేద్దామా

కోడి పందాలు చూద్దామా

కొత్త వింతలు నేర్దామా


సందడి సందడి గుంపులతో

సంక్రాంతి వేడుక జరుపుదమా

సరదా పండుగ ఈ రోజు

చెంగు చెంగున రారండి