నాన్నా ....: -మొహమ్మద్ . అఫ్సర వలీషా ద్వారపూడి( తూ గో జి )


 నా మస్తిష్కం లో

నీ రూపు నింపుకున్నా

నా  కలలో నైనా

కలగా వస్తావని.....


నా మనోఫలకంపై

అద్దుకుంటున్నాయి

 నీ నవ్వులు చెరగని 

జ్నాపకాలుగా.....


గుండె విలవిల 

లాడుతోంది

నీవు లేవనే నిజం

తెలిసి నప్పుడల్లా.....


నీ ఊసులను

నెమరేసుకుంటున్నా

బాధగా ఉంది 

అవి ఊహలని తెలిశాక ...


నీవు బ్రతికున్నా

చనిపోయినా మారనిది

గుండె గదిలో

నీ స్థానం....