భలె...భలే ..జాంకాయ..:-----డా .కె .ఎల్ .వి.ప్రసాద్ , హన్మకొండ .


 పండూ ..పండూ ...

జామపండు ...

నిగ ..నిగ ..లాడే 

తియ్యతియ్యని 

జాంపండూ ...!


పెరట్లో పెరిగింది 

జామచెట్టు ....

నిత్యం కాయలతో 

నిండుగా ఉంటుంది 

మా ..జామచెట్టు ..!


ఒకప్పుడు ...

సామాన్యుడికి 

అందుబాటులో ఉండేది 

జామ కాయ ....

ఇప్పుడు ....

పేదవాడికి అందని 

ద్రాక్షపండు ..జామ కాయ !


పండైతే ...

చిలకల కొట్టుడు ..

పచ్చిగ ఉన్నా ....

ఉడ తల కొట్టుడు ,

మిగిలినవే ...

మనకు దక్కేవి ...!


జామకాయను 

నిర్లక్షం చేయరాదు ...

ఆరోగ్యానికి ..అది 

బహుచక్కని కాయ !


ఇష్టపడి తినాలి 

పండుకాని ---

జామకాయ.....!!