ఏనుగు -బాల గేయం :--ఎం. వి. ఉమాదేవి -- నెల్లూరు


 ఏనుగమ్మా ఏనుగు 

ఎంతో చక్కని ఏనుగు 


అన్నిటికన్నా పెద్దది  

అడవులలోను ఉంటుంది 

తెలివితేటలూ ఎక్కువ 

చెరుకులు,అరటి మక్కువ!


మచ్చికచేయుట కష్టo 

మనుషులు అంటే ఇష్టం

పెద్ద దేహంతో అయ్యో పాపం  

తల్లక్రిందులుగా చాలా చిత్రం !


జంతు రక్షణ చేయాలి 

జాతిని మేలు కొలపాలి !

అటవీశాఖకు సాయంగా 

దుంగలుమోసే సులభంగా!


గుంపులుగానే ఉంటాయి 

నీటికి మేతకు పోతాయి 

గణపతి దేవుడి  అవతారం

విలువలునేర్పే సంస్కారం!



కామెంట్‌లు