వృద్ధులను ఆదుకోవాలి (స్ఫూర్తి కథ) -- కందర్ప మూర్తి , కుకట్ పల్లి , హైదరాబాదు


 నగర టౌన్ హాల్  లేడీస్ క్లబ్ లో  మేయర్ కుమిదినీ దేవి

అద్యక్షతన  అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

ఘనంగా జరుగుతున్నాయి.


    పెద్ద హోదాల్లో ఉన్నవారు పేరు ప్రఖ్యాతులున్న మహిళలు

ఖరీదైన కార్లలో ఆధునిక వస్త్ర ధారణతో చేతిలో మొబైల్ ఫోన్లు

పట్టుకుని ఆంగ్లంలో మాట్లాడుకుంటూ వయ్యారంగా  లోపలి కొస్తున్నారు.


      ముఖ ద్వారం వద్ద సెక్యూరిటీ సిబ్బంది సెల్యూట్ చేసి

 వారికి స్వాగతం పలుకుతున్నారు.పరసరాలు రంగు రంగుల

దీపాలతో అలంకరించారు. మరొకవైపు  సాంస్కృతిక  కార్య

క్రమాలు విందులు వినోదాల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

         అందంగా అలంకరించిన వేదిక మీద  మహిళల చర్చలు

పుస్తక ఆవిష్కరణలు సన్మానానికి శాలువలు పుష్పగుచ్ఛాలతో

నిర్వాహకులు సందడిగా కనబడుతున్నారు.


     ఇవేవీ పట్టనట్టుగా చిరిగినచీర చింపిరి జుత్తుతో ఒక ముసలవ్వ చిన్న సిల్వరు గిన్నె చేత్తో పట్టుకుని తినడానికి ఏమైనా పెట్టమని కారు పార్కు దగ్గర కూర్చుని లోపలికొచ్చే

మహిళల్ని అడుగుతోంది.ఎవరూ ఆమెవైపు చూడటం లేదు.

 అటుగా వచ్చిన సెక్యూరిటీగార్డు దూరంగా పొమ్మని కేకలేస్తే

   లేని శక్తిని కూడ కట్టుకుని ఊతకర్ర సాయంతో మెల్లగా నడుచు

కుంటు కొద్ది దూరమెళ్లి  నీర్సంతో కూలబడింది.


     రోడ్డంతా మహిళల రాకతో కోలాహలంగా ఉన్నా ముసలామెను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.


   ప్రెస్ రిపోర్టర్ వెంకటేశం న్యూస్ కవరేజి కోసం అటుగా వచ్చి ముసలవ్వ దీనావస్థను చూసి తన మోటర్ బైకును రోడ్డుకు

పక్కన ఆపి అవ్వ దగ్గరికొచ్చి చూస్తే నాలిక పిడచకట్టి ఆయాస

పడుతు కనబడింది.


       వెంకటేష్ వెంటనే దగ్గర్లో ఉన్న పాన్ షాపు దగ్గరకెళ్లి మినరల్

వాటర్ బాటిలు అరటిపళ్లు కొనితెచ్చి అవ్వ చేత నీళ్లు తాగించి

పళ్లు తినిపించాడు. అవి తిన్న తర్వాత అవ్వకి కొంచం శక్తి

వచ్చింది.


  అవ్వ ముఖ లక్షణాల్ని బట్టి బాగా బతికిన స్త్రీ గా అనిపించి

ఆమె  వివరాలడిగాడు వెంకటేష్.


   పేరు వీరమ్మనీ, గ్రామంలో పరపతి ఉన్న రైతు కుటుంబమని

కరెంట్ షాక్ తో భర్త చనిపోతే  ఉన్న ఒక  కొడుకును  భూమి

అమ్మి పట్నం పంపి పెద్ద చదువులు చెప్పిస్తే  ప్రయోజకుడై

పెద్దింటి పిల్లను ప్రేమ పెళ్లి చేసుకుని పెళ్లాం మోజులో పడి

అక్షర జ్ఞానం లేని సనాతన ఆచార  అమాయక తల్లిని గాలి కొదిలేసి

వదిలేస్తే  ఊళ్లో తిండికి కరువై పట్నం చేరి బిచ్చమెత్తుకుని

రోజులు గడుపుతున్నానని  కొడుకు వివరాలు తెలియవనీ

చెప్పింది అవ్వ.


    అంతర్జాతీయ మహిళా దినోత్సవాన ఒక ముసలవ్వ

' ఆకలి కేక ' అని వీరమ్మ ఫోటోతో దినపత్రికలో కధనం

ప్రచురించాడు న్యూస్ రిపోర్టర్ వెంకటేష్.


     తాత్కాలిక వసతి కోసం ప్రభుత్వ వృద్ధాశ్రమంలో చేర్పించాడు. దిన పత్రికలో వార్త చదివిన మహిళా సంఘాలు స్పందించాయి.


    పెద్ద సెలబ్రిటీ హోదాలో ఉన్న వీరమ్మ కొడుకును శోధించి

అడ్రసు తెలుసుకుని సాదరంగా అప్పగించి మహిళా దినోత్సవ

స్ఫూర్తిని నిలబెట్టాడు వెంకటేష్.


   టౌన్ హాల్ లేడీస్ క్లబ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ

వేడుకల్లో వీరమ్మ కోడలు ఉండటం కొసమెరుపు.

            *                     *                         *