దేశభక్తి: --డా.రామక‌ కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 నా దేశం,నా మాతృభూమి
అనే హృదయ నీరాజనం.
ప్రాణత్యాగానికైనా వెనుకాడని
నిజమైన తత్వం.
ఘన వారసత్వం,విజయాలను
మనసారా కీర్తించడం.
త్యాగధనుల,నిస్వార్థ చింతనుల
సందేశాల నిక్షిప్తం.
భరతమాత ఋణం తీర్చుకొనే
కర్తవ్య ముద్రణం.
దేశం కోసం ఏమైనా చేయడానికి నిలబడే ధైర్యం.
ఈ నేల,గాలి,సంస్కృతులపై
అలవిమాలిన‌ అభిమానం.
అభివృద్ధి,సంపదల సృష్టి,
సామరస్యాల ఆచరణం.
మాతృభూమి కన్నా మరోటి లేదను అంకితభావ మనో నిశ్చయం.
దేశము నందు భక్తి కడదేరే వరకు.
తల్లి ఒడి లాంటి అస్తిత్వం.
కామెంట్‌లు