నారువోసినీరు బెట్టి
అదను చూసి
చదునుజేసి
సరైన కాలం చూసి
నాటిన పొలం
ప్రకృతి ప్రసాదమైన
ఎండకు వానకు
తట్టుకొని
గింజబట్టి
ధాన్యపు రాశిగా
మారే క్రమంలో
రైతుకష్టం
పందికొక్కులు
దండకొంటుంటే
నూర్పిడులను
తూర్పారబట్టి
తాలుదీసి
ధాన్యపు గింజలు
పొందడం తెలిసిన
హలధారికి
తినబోయే సమయాన
గద్దొచ్చి తన్నుకుబోతుంటే
పిల్లల కోడిలా
తన ఫలసాయాన్ని
కాపాడుకోడానికి
చేసిన ప్రయత్నాలన్నీ
విఫలమవుతున్నా
కాడి ఒదలక
మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తుంటే
నాయకుల తరాజు
రైతుకష్టాన్ని
పైవాడి చేతికందిస్తుంటే
అన్నదాత కడగండ్లు
చూసిన దయలేని మారాజు
మిన్నకున్నాడు
మనకెందుకులే అనుకున్న
భద్రలోకులకు
రైతన్న కన్నీటి సేద్యం
కనబడకున్నది
కన్నీటిసేద్యం: - లక్ష్మీ శ్రీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి