హాయిగా ఎగురనీయండి:-కిలపర్తి దాలినాయుడు


 గుప్పెడు గింజలువెయ్యండి

కప్పుడు నీళ్ళు పొయ్యండి

పిట్టను పొట్టనుపెట్టకనే

పిట్ట పొట్టనే  నింపండి!


అడ్డుగ ఉచ్చులు తీయండి

హాయిగా ఎగురనీయండి!

పక్షుల కిలకిల రావాలే

పకృతి పాడిన పాటండి


నింగిలోన మన రక్షకులు

రంగుల రంగుల రక్షకులు

పర్యావరణపు ప్రేమికులూ

పక్షులు ప్రశాంతకాముకులు


చెట్టూ సేమకు స్నేహితులు

విత్తుల విసరే కర్షకులు

ఖగములు గగనపుజెండాలు

సంతోషపు సంకేతాలు

పిల్లల్లాగ ఎగరాలి

పిట్టలు కలకలలాడాలి!


కామెంట్‌లు