మాగురువుగారూ మాగురువుగారూమాముద్దు మాటలకు మురిసిపోతారూ
మాతొ మాటలాడుతు మైమరచుతారూ
నిండైన ప్రేమను కురిపించుతారూ !!మా!!
ఆటలన్నీ మాతొ ఆడించుతారూ
పాటలన్నీ మాతొ పాడించుతారూ
ఆనందాన్ని మాకు పంచుతారూ !!మా!!
మంచి కథలన్నీ మాకు ఎంచి చెబుతారూ
మంచి మాటలన్నీ మాకు ఎంచి చెబుతారూ
మంచి నడతలన్నీ మాకు ఎంచి చెబుతారూ !!మా!!
భాషలూ శాస్త్రాలు బాగ చెబుతారూ
విజ్ఞానమెంతో మాకు నూరిపోస్తారూ
చదువులోని మర్మమెల్ల మాకు చెబుతారూ జ్ఞాన భిక్షను మాకు పెడతారూ !! మా!!
దేశభక్తిని,రాష్ట్రభక్తిని,పెద్దలపై భక్తిని
భాషపైభక్తిని, దైవభక్తి,మాతపితలపైభక్తిని
ప్రబోధించి మాలోనింపుతారూ !!మా!!
బాలలూ బాలలూ మీదే భవిష్యత్తంటారూ
బాలలూ బాలలూ మీరే వారసులంటారూ
బాలలూ బాలలూ మీరే భావిభారత పౌరులంటారూ !!మా!!
గురువుగారు:- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి