పక్షి : --కె ఎస్ అనంతాచార్య

 ఆ భాష అర్థం కాకపోవచ్చు
వాటి సైగలు అన్వయం చేసుకోవటానికి  శాస్త్ర పరిజ్ఞానం అందక పోవచ్చు
గూళ్ల నిర్మాణ శైలి ఇంజినీరింగ్ విద్యలో చోటు చేసుకోక పోవచ్చు
గడియారానికి  సమయాన్ని తెలపటం నేర్పిన
 కుక్కుట కూతలు ఎలా ఎలా వినిపించ గలుగుతోందో నిర్మాణ రహస్యం మేధకు బోధ పడక పోవచ్చు
విల విలలాడిన క్రౌంచ పక్షుల ప్రేమాయాణం రామాయణ
ఆవిష్కారానికి   చరిత్ర గ నిలిచిన  అద్వితీయ పాత్ర! 
పక్షుల కూతలు వినిపించకపోతే  
కవి రాతలలో కరుణ కురియదు
  కోయిల లేకుంటే కొత్తరాగం పుట్టదు
నెమలి ఆడకుంటే  నాట్య గతుల లో అపశ్రుతులు
ఆకాశంలో పక్షుల వరుసల కదలికల్లో వాయుయాన విమానజాడల మెరుపులు
సైబేరియా కొంగల
ఆహారపు వేట 
మనిషికి చూపిన ఆర్థిక బాట
ఆకుపచ్చని అడవి రంగుల హంగుల 
దృశ్య కావ్యం వీడియో కు మూల రూపం
 కిచకిచలు,  నదీ నాదాలునేపథ్య సంగీతo

అల్పజీవులు అంతరార్థం చెప్పే శబ్ద వాచకాలు
పరుగులు అన్నీ ప్రతీకలు

ఎన్నిచెప్పినా కాలం మారింది 
ఉరవిష్కల ఉనికిని ఫోన్ 
టవర్లు మాయం చేసి చిత్రాలను అంతర్జాలం లో ప్రక్షిప్తం చేశారు
అడగాల్సినదేది లేదు అన్ని జాతులు పరిశ్రమల 
యంత్రాల కింద నలిగి  జీవకారుణ్యం బోర్డ్ ల మీద మిగిలింది
సలీమాలి మేధోతోటలో  మాత్రమే సజీవులై సంచరిస్తున్నాయి ఇప్పుడు  చిలక జ్యోస్యo మనిషి రాతలో నలుగుతుంది తమను కాపాడమని కోడై కూస్తోంది గుడ్ల గూబయి భయ పెడుతోంది కాకియై శాసనాల అమలు చేయమని అరుస్తోంది