ఎలుక ఆకలి: (ఓ బుల్లి కథ): - జగదీశ్ యామిజాల

 అనగనగా ఓ ఎలుక. అది చాలా కాలంగా ఆకలితో అలమటిస్తోంది. ఓరోజు అది ఆకలికి తట్టుకోలేక నీరసంతో దిక్కులు చూస్తుంటే ఓ బుట్ట కనిపించింది. ఆ బుట్టలోకెళ్ళడానికి చిన్న కన్నం చేసింది. బుట్టలో మొక్కజొన్న గింజలను చూడటంతోనే ఎలుక్కి ప్రాణం లేచొచ్చింది. పట్టరాని ఆనందంతో తినడం మొదలు పెట్టింది. తిన్నకొద్దీ ఆ ఎలుక లావైపోయింది. బుట్టకు చేసిన కన్నంలోంచి ఇవతలకు రాలేక లోపలే ఉండి ఆపదలో పడింది ఎలుక. పాపం ఎలుక!


నీతి - అత్యాశ తగదు


కామెంట్‌లు