పల్లెలకే వెళ్ళాలి!: -- బాలవర్ధిరాజు మల్లారం


 అవును
పండుగలకు,పబ్బాలకు 
పట్టణాల నుండి
పల్లెలకే వెళ్ళాలి;
పల్లెలను పలుకరించడానికి
ఒళ్ళును పులకరింప జేసుకోడానికి
సంబురాలను చేసుకోడానికి
బంధు మిత్రులను చూసుకోడానికి
ఆత్మీయతలను పంచుకోడానికి
ఆప్యాయతలను పెంచుకోడానికి
బంధాలను కలుపుకోడానికి
అనుబంధాలను నిలుపుకోడానికి
చిన్న నాటి 
తీపి జ్ఞాపకాలను ఏరుకోవడానికి 
మళ్ళీ బాల్యం లోకి చేరుకోవడానికి.
పట్టణాల నుండి
పల్లెలకే వెళ్ళాలి!