మినీలు : జగదీశ్ యామిజాల

 ప్రపంచ దృష్టిని 
నేను మార్చలేను
కానీ
నా దృష్టిలో
ప్రపంచాన్ని మార్చగలను
అందంగా
మంచిగా
+++++++++++
 ఇష్టమైన వారికోసం
ఎప్పుడూ పూస్తుంటాయి
పెదవులపై నవ్వులపువ్వులు
+++++++++++
ఇష్టమైనవారి కోపం 
చిరుజల్లుల్లాంటివి
తడిసి ఆస్వాదించడమంటే
ఎంత ప్రేమో నా మనసుకి
+++++++++++
 అనుకున్నదవుతుంది
అనే నమ్మకమే
బతకాలనుకున్న వారి 
గొప్ప శక్తి
+++++++++++
నిన్ను నువ్వు
నమ్మనంత వరకూ
ఏదీ దొరకదు