అదుగదుగో ఎగురుతోంది జాతీయ జెండాగగనమంత నిండుతోంది భారతీయ జెండా !!అదుగదుగో!!
స్వాతంత్ర్య యోధులా ప్రాణ ప్రదమూ
గణతంత్ర పౌరులా మాన ధనమూ
పింగళి వెంకయ్య నేర్పుగ చేసే
ప్రియతమ తాతయ్య ఓర్పుగ కూర్చే !!అదుగదుగో!!
తెల్లవారి గుండెల్లో నిదురించిందీ
మా చల్లారిన పౌరుషాగ్ని రగిలించిందీ
మూడురంగుల్లో మెరిసిపోతోందీ
మనకందరికీ స్ఫూర్తినిస్తోందీ !!అదుగదుగో!!
సర్వమతాల సమభావననూ
సర్వజనాల సముపార్జనగా
పిల్లాపాపలూ చిన్నాపెద్దలూ
జండానీడలో సుఖాలతేలగా !!అదుగదుగో!!
జెండా: -:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి