మందుల్లో మత్తుపొడి(నానీలు):-డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.


 1.శరీరానికి

మనసుకు

మత్తందించే మాత్రలతో

మహానిద్రే సుమా!


2.మందుల్లో 

మత్తుపొడితో

చింతలు మాయం

అనారోగ్యం ఖాయం


3.మత్తెక్కించి

మైమరిపించి

ఒళ్ళు తేలిక చేసి

నిద్ర పుచ్చుతుంది.


4.రక్తంలో చేరి

రౌద్రమవుతుంది.

రోగనిరోధకం

నిర్వీర్యమవుతుంది.


5.బాధ తెలియనీయక

ఏమారుస్తుంది.

బతుకు మీద

దెబ్బకొడుతుంది.


6.తెలియకుండానే 

ప్రవేశిస్తుంది.

తెలుసుకొనే లోపే

తెల్లవార్చేస్తుంది.


7.పొడిపొడిగా

చేరుతుంది.

పరువాన్ని‌

ప్రణాళికతో హరిస్తుంది.