ఎక్కడ ఎక్కడఎంత వేదికినా కనపడదు
అవసరం అని తెలుసు
లేకపోతే కష్టం అని తెలుసు
అయినా అశ్రద్ధ నాకు
ఎక్కడ పెట్టానో
రోజు వెతుకులాటే
అమ్మ ఎపుడు ఇంతే
నాన్నని ,చెల్లిని , నన్ను
హడావుడి పెట్టేస్తుంది
అర్జెంట్ అంటూ
అందరితో వెతికిస్తుంది
వెతికి వెతికి అలసి
కూర్చుండిపోయాం అందరం
అంతే కళ్ళు జిగెలు మన్నాయి
హమ్మయ్య అనుకున్నాం
వెంటపడ్డాం, బతిమిలాడాo
దానికి ఇష్టమైనవన్నీ ముందుపెట్టాం
ఇల్లాంతా తిప్పి తిప్పి
తీసుకెళ్లి అమ్మచేతిలో పెట్టింది
ఇంతకీ ఏమిటా అనుకుంటున్నారా
మా కుక్కపిల్ల హ్యారీ నోట్లో
అమ్మ కళ్ళజోడు.....
హమ్మయ్య దొరికింది: ---పి.విశాలాక్షి...సికింద్రాబాద్..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి