*శుభ్రమగు పాంచజన్యము**అభ్రంకష మగుచు మ్రోవ | నాహవభూమిన్**విభ్రములగు దనుజసుతా**గర్భంబుల పగులజేయు | ఘనుఁడవు కృష్ణా !*తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..ఓ దనుజ సంహారా, నీవు రణరంగములో పాంచజన్యమను నీ శంఖమును గట్టిగా పూరించినపుడు ఆకాశము బ్రద్దలు అవుతుందేమో అనేంత గొప్పశబ్దము అయ్యింది. ఆ శబ్దము యొక్క మహత్యము వలన ఎంతో మంది రాక్షస మాతలకు గర్భాలు పోయాయి. అందువలన చాలా మంది రాక్షసులు పుట్టకుండానే మరణింప చేసిన మహానుభావుడివి దేవా. .....అని శతకకారుడు నృసింహ కవి వాక్కు*ఓ దనుజవైరీ, తాటకీ, కంస సంహారముతో మొదలు, ఎందరో ఎంతో మంది రాక్షసులను దనుమాడి ఈ భూమాత భారాన్ని తగ్గించిన వాడివి నీవే. "ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంత మాత్రమే నీవు! అంత రాంతరములేంచీ చూడ పిండంతే ఇప్పటి కన్నట్టూ..."* అంటూ ఆ *నవరస నటనా నాయకుని* వేడుకొందాము......ఓం నమో వేంకటేశాయNagarajakumar.mvss
శ్రీ కృష్ణ శతకము - పద్యం (౨౬ - 26)