పల్లెటూరు పిల్లోడుపరుగుతీసి ఉరికాడు
చెట్టు కింద చేరాడు
సిర్రగోనె ఆడాడు
పరుగులు తీసే ఉరికాడు
ఊరువాడ తిరిగాడు
ఉప్పు బస్తాట ఆడాడు
ఉల్లాసంగా ఉన్నాడు
బడి గంట మోగింది
బాలుడు ఇంటికి వెళ్ళాడు
బావిలో నీరు తోడాడు
గబగబా స్నానం చేశాడు
ఉతికిన బట్టలు వేశాడు
అంబలి కొంచెం తాగాడు
జబ్బకు సంచి వేశాడు
బడికి బాలుడు వెళ్ళాడు
గురువుకు దండం పెట్టాడు
చెప్పిన పాఠం చదివాడు
ఇల్లు చేరా వచ్చాడు
ఇంటిలో పనులు చేశాడు
పల్లెటూరు పిల్లోడు(బాల గేయం):---ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి