నవ్వులరేడు రేలంగి.:-డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్ .

 తేలుగు నాటకరంగ చరిత్ర ప్రారంభం గురించి చెప్పడం కష్టం.చాళిక్యుల పాలనకు ముందునుంచే తెలుగునాట నాటక ప్రదర్మనలు ఏదో ఒకరూపంలో ఉన్నట్లు అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి.'అంకమాలిక'అనే గేయనాటికలు ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తుంది.1860 లోశ్రీకోరాడ రామచంద్రశాస్త్రిగారి'మంజరిమధుకరీయం'తో తెలుగునాటకరంగం ప్రారంభం ఐనదని పరిశోధకులు నిర్ఢారించారు.
ఎందరో నటతేజోమూర్తులు సగర్వంగా నాటక రంగంనుండి  వేదికనుండి వెండితెరకు వెళ్ళారు. అలావెళ్ళినవారిలో  ఒకరైన రేలంగి వెంకట్రామయ్య తూర్పుగోదావరిజిల్లా రావులపాడులో 1919ఆగస్టు 9 నజన్మించారు .వీరితండ్రి రామస్వామి హర్మోనియం పెట్టెలు రిపేరుచేస్తుంటే తను సహాయపడేవారు. పెద్దగా చదువు అబ్బకపోయినా,నటనపట్ల ఆసక్తితో కాకినాడలోని'యంగ్ మ్యాన్స్ హ్యాపీక్లబ్ 'లోచేరి పలుప్రదర్సనలు యిస్తుండేవారు.నాటి ప్రముఖ సిని,స్టేజి హాస్యనటుడు జోగినాధం గారివద్ద శిష్యరికం చేయమని  ప్రముఖ సినీ దర్మకుడు చిత్తజల్లు పుల్లయ్యగారు సలహా యివ్వడంతో అలానే చేసారు.
(1935-ఏప్రిల్ 12)న విడుదలైన' శ్రీకృష్ణతులాభారం' చిత్రంలో రేలంగి తొలిసారిగా వసుదేవుని పాత్రలో నటించి 75 రూపాయల పారితోషికం పొందారు. ఇంకా ఈచిత్రంలో 'ఋష్యేంద్రమణి'' కాంచనమాల'' 'లక్ష్మిరాజ్యం'వంటివారుకూడా  పరిచయం చేయబడ్దారు. అనంతరంమీర్జాపురంరాజావారునిర్మించిన'గొల్లభామ'(1949) లో నటించారు (అంజలిదేవికిఇదే చిత్రంలో పరిచయంచేయబడ్డారు )ఈరెండుచిత్రాలకు రేలంగి సహాయదర్మకుడిగా పనిచేసారు.'గుణసుందరికథ' నటించారు.(15-3-1951) నవిడుదలైన 'పాతాళభైరవి'చిత్రంలో రాణిగారు(విమలారావు ) తమ్ముడిగా నటిస్తూ 'తాళలేనే నేతాళలేనే'- 'వినవేబాల నాప్రేమగోల' పాటలుస్వయంగా పాడుకున్నారు.అనంతరంవాహినివారి'పెద్దమనుషులు' చిత్రంలో తిక్కశంకరయ్య  పాత్ర అద్బుతంగా పోషించారు.
(12-1-1955) నవిడుదలైన విజయావారి'మిస్సమ్మ'చిత్రలో దేవయ్య పాత్ర పోషిస్తూ 'ధర్మంచెయిబాబు'-'సీతారాం సీతారాం'పాటలుస్వయంగాపాడుకున్నారు.          (14-1-1959)విడుదలైన'అప్పుచేసిపప్పుకూడు'చిత్రంలో భజగోవిందం పాత్ర బాగానటించారు. (19-4-1962)విడుదలైన 'భీష్మ'(1962)విడుదలైన' చెంచులక్ష్మి' చిత్రాలలో నారదుని పాత్రధరించారు.అంజలిదేవితో 'సతీసక్కుబాయి' ,ఎస్ .వరలక్ష్మిగారితో 'మామకుతగ్గఅల్లుడు' (1960)లో'సావిత్రిగారితొ కథానాయకుడిగా నటించారు.
తనకుమారుని పేరుమీద'సమాజం'అనే చిత్రం నిర్మించారు.తాడేపల్లిగూడెంలో 'రేలంగిమందిర్ 'అనేసినిమా ధియోటర్ నిర్మించారు. వీరికుమారుడు సత్యనారాయణబాబు బాలనటుడుగా నటించినచిత్రం 'రాజయోగం'(1968) 
ఆరోజుల్లో రేలంగికి జరిగినన్ని సన్మానాలు మరే నటుడికి జరుగలేదు.ఆస్ధానకవి శ్రీపాదకృష్ణమూర్తి రేలంగికి'హాస్యనటచక్రవర్తి' బిరుదు ప్రదానం చేసారు.సినీ నటులలో తొలి' పద్మశ్రీ'అవార్డు గ్రహితగా గుర్తింపు పొందారు.
తొలితరం నటుడిగా జీవితాన్ని ప్రారంభించి 500 పైగా చిత్రాలలో నటించినా ,తనఉన్నతికి కారణమైన నాటకరంగాన్నిమరువకుండా,తరచూ ప్రదర్మనలుయిస్తూ 'చింతామణి' నాటకంలో 'సుబ్బిశెట్టి 'పాత్రవంలసార్లు పోషించారు.అలానే             (11-4-1956) విడుదలైన 'చింతామణి'చిత్రంలో సుబ్బిశెట్టి పాత్రపోషించారు.ఇంకా 'మనదేశం'(24-11-1949)'జయసింహ'
(21-10-1955)'మాయబజా'(27-3-1957)'వీరకంకణం' (16-51957)'వద్దంటేడబ్బు' (25-6-1954)('రాజుపేద'(6-11-1959)'బండరాముడు'(
27-51960)'రాణిరత్నప్రభ' (9-8-1961)'జగదేకవీరునికథ'(7-6-1962) వంటి చిత్రాలలో తన నటవైదుష్యంతో నవ్వించిన రేలంగి (27-11-1975) న కన్నుమూసారు.