తాటి చెట్టు -(బాలగేయం )-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు.


 ఊరి చివర తాటిచెట్టు 

మనకు మేటి దోస్తు ఎట్లు? 

గౌడ వారి భృతికి మెట్లు 

కల్పవృక్ష తీరు ఇట్లు!


గూడు కొరకు ఆకులిచ్చు 

వేసవిలో ముంజెలిచ్చు 

సంకు రాత్రి భోగిమంట 

కమ్మనివే తేగలంట!


తాటి మాను ఇంటిదూలం 

మేటి వంతెనకదే బలం 

తాటి పండు తీయదనం 

తాళపత్రాలతో గ్రంథo!


పల్లెఇంట్లో పెళ్లి పందిరి 

మల్లెలు పోసే బుట్టలల్లిరి 

తాటిబెల్లం ఔషద విలువలు 

వానకు తాటియాకు గొడుగులు!