అంబ(పురాణ పాత్ర ):--డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్

 అంబ,అంబిక,అంబాలిక అనే సోదరి మణులు హోత్రవాహనుడు అనే కాశీరాజు కుమార్తెలు.అంబసాళ్వుని ప్రేమిస్తుంది.కానిభీష్ముడు వీరిస్వయంవరంలో వీరిని బలవంతంగా రధం ఎక్కించుకుని తనతమ్ములు చిత్రాంగదుడు,విచిత్రవీర్యుల కొరకు బయలుదేరి అడ్డువచ్చిన  సాళ్వునితో సహా అందరిని జయిస్తాడు.హస్తినాపురంచేరాక అంబ తను సాళ్వుడిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆమెను రాచమర్యాదలతో పంపిస్తాడు. సాళ్వుడు తిరస్కరించడంతో,హస్తినాపురంచేరి తనను వివాహం చేసుకోమని భీష్మునికోరుతుంది.తను ఆజన్మబ్రహ్మచారిని కనుక వివాహం చేసుకోలేను అంటాడు భీష్ముడు.దుఖిస్తువెళ్లి భీష్ముని అస్త్రగురువైన పరశురాముని శరణువేడుతుంది.పరశురాముడు భీష్మునికి ఎంతచెప్పినావినడు.కోపగించినపరశురాముడు భీష్మునితో ఇరవైనాలుగురోజులయుధ్ధంచేసి,తనుఏమిచేయలేనని అంబకుచెప్పివెళ్ళిపోతాడు. బాధపడినఅంబ ధృఢనిశ్చయంగా'పైలగర్గ'అనేప్రదేశంలో శివునిగురించి తపసుచేసి వచ్చెజన్మలో భీష్ముని జయించేవరం పొంది,ద్రుపదునిఇంట శిఖండిగాజన్మిస్తుంది.భీష్ముడు స్త్రీలపన,బాలలపైన,దిగంబరంగాఉన్నవారిపైన,వెన్నుచూపినవారిపైన, ఆడగాపుట్టిమగవాడిగా మారిన వారిపైన,ఎన్నడూ ఆయుధం గురిపెట్టడు.అది ఆయననియమం.దాన్ని ఆసరా చెసుకొని అర్జునుడు మహాభారతయుధ్ధంలో శిఖండిని అడ్డు పెట్టుకుని భీష్ముని పైఅస్త్రాలు ప్రయోగిస్తాడు.స్వయమరణం వరం తనతండ్రి ఇచ్చినప్పిటికి భీష్ముడు అంబకు శివుడు ఇచ్చిన వరానికి కట్టుపడి అంపశయ్యపైవాలిపోతాడు. అంబ భీష్మునిపై తనపగ అలాతీర్చుకుంది.