గులాబీ: -కవిత వేంకటేశ్వర్లు


 రోజా విరులలో రాజు

రోజా పువ్వంటే పూభోణులకు

మోజు

కొప్పులో అది రారాజు

మెప్పులో ఫస్టు ప్రయజు!!


అలంకరణలో అందం

ఇట్టే ఆకర్షించే సోయగం

అతివలకు అపురూపం

మెడలో కెంపు రాగం!!


తోటకు గులాబీ

నజరానాతో నవాబీ

చమక్కుల షరాబి

తింటే జిలేబి!!