భక్తఅంబరీషుడు.:-డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్ .

 వైవస్వతమనువు కుమారుడు నభాగుడు ఇతని పుత్రుడు అంబరీషుడు.

పరమభాగవతుడు ఇతను.ఒకరోజు ద్వాదశి ఘడియలో విష్ణువును పూజిస్తుండగా,దుర్వాసమహర్షి అతనికి అతిథిగా వచ్చాడు.అంబరీఘుడు ఆయనకు సకల మర్యాదలు చేసి ఆహారం సిద్ధంచేయించాడు.దుర్వాసుడు తను స్నానం చేసి వస్తానని చెప్పి సమీపంలోని యమునానది దగ్గరకు వెళ్ళాడు.అతను ద్వాదశి ఘడియలు సమీపిస్తున్నా రాక పోఏసరికి ఉపవాస దీక్షలోఉన్న అంబరీషుడు బ్రాహ్మణుల సూచనమేరకు శ్రీహరి పాద తీర్దాన్ని స్వీకరించాడు. సరిగ్గా అదే సమయానికి అనుష్ఠానం ముగించుకుని తిరిగివచ్చిన దుర్వాసుడు,తనురాకుండా అంబరీషుడు తీర్ధం స్వీకరించి తనను అవమాన పరిచాడని ఆగ్రహించాడు.వెంటనే తన తపోశక్తిచే 'కృత్య'అనేశక్తిని సృష్టించి అంబరీషుని  పంపగా ,ఆమహాభయెంకరరూపం అగ్నిజ్వాలలు వెదజల్లుతూ అంబరీషుని పైకి వచ్చింది.శ్రీమహావిష్ణువును ధ్యానించగా విష్ణుచక్రం కృత్యను అంతమొందించి దుర్వాసునితరమసాగింది.బ్రహ్మ,కైలాస లోకాధిపతులతో మొరపెట్టుకోగా వారు తామేమి చేయలేమని విష్ణువుని శరణు వేడమని చెప్పారు.

వెను వెంటనే వైకుంటంచేరి శరణు వేడుకున్నాడు.తను ఏమిచేయలేనని అంబరిషుని శరణువేడమని చెప్పాడు.దుర్వాసుడు అంబరీషుని శరణువేడగా శాంతమూర్తి అయినఆయన విష్ణుచక్రాన్ని ఉపసంహరించాడు.అంబరీషుని విష్ణుభక్తిని ,గొప్పదనాన్ని పొగిడి,ఆశీర్వదించి దుర్వాసుడు వెళ్ళిపోయాడు. కాలక్రమంలో తన ముగ్గురు పుత్రులకు రాజ్యం అప్పగించి తపోవనాలకు వెళ్ళాడు అంబరీషుడు.