ఆశ్చర్యం:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి--మొబైల్: 9908554635.

  కమల-విమల ఒకే గ్రామానికి చెందిన వారు. వారిద్దరూ పొరుగు గ్రామమైన రామాపురం సంతలో కలుసుకున్నారు. కమల విమలను ఎప్పుడు వచ్చావని అడిగింది ."ఇప్పుడే" అని జవాబు చెప్పింది కమల . "నీవు ఎప్పుడు వచ్చావు" అని అడిగింది కమల.  " ఇప్పుడేనని "అంది విమల . "అవునూ! నీవు ఎన్ని గంటలకు బయలుదేరావు" అని అడిగింది కమల . "తొమ్మిది గంటలకు "అని జవాబు చెప్పింది విమల." ఆశ్చర్యంగా ఉందే! నేను కూడా తొమ్మిది గంటలకే బయలుదేరాను" అని అంది కమల . "అవునూ! ఇంతకీ నీవు ఎవరి గుర్రపు బండిలో వచ్చావు" అని ప్రశ్నించింది కమల? " కొండాపురం జంగయ్య బండిలో "అని జవాబు చెప్పింది విమల. "అరే! నేను కూడా ఆ బండి లోనే వచ్చానే. నీవు కనపడలేదేంటి ?అబద్ధం ఆడుతున్నావా !"అని అడిగింది కమల." లేదు లేదు! నేను కొండాపురం జంగయ్య బండి లోనే వచ్చాను "అని అంది విమల.ఆ బండి లో ఇద్దరమే ఎక్కామే "అని అంది కమల. "అవును. నేను మరో ఆమె. మేము కూడా ఇద్దరమే ఎక్కాము. మా బండి లో నీవు లేనే లేవు" అని అంది విమల. కమలకు ఆశ్చర్యం అనిపించి "ఏదీ !నీ బండి అతను ఎక్కడున్నాడో ఒకసారి చూపు "అని అంది. వెంటనే విమల తన బండి ఆసామిని చూపింది.  "ఓహో! ఇతడు నా బండి ఆసామి కానేకాడు. పొరపాటున కొండాపురం జంగయ్య అని చెప్పావేమో!" అని అంది కమల. " లేదు లేదు. ఇతడు కొండాపురం జంగయ్యనే .కావాలంటే అడుగు "అని అంది విమల. ఆ బండి ఆసామి తన పేరు" కొండాపురం జంగయ్య" అని చెప్పాడు .ఈసారి కమల ఆశ్చర్యపోయింది. వెంటనే తానే ఎక్కి వచ్చిన బండి ఆసామిని పిలిచి అతని  పేరును అడిగింది .అతడు తన పేరు కొండాపురం జంగయ్య ని చెప్పాడు. అప్పుడు ఆశ్చర్యపోతున్న విమలతో బండి వాళ్ళు ఇద్దరూ "అవును .మా ఇద్దరి పేర్లు ఒకటే .ఇద్దరం సరిగా తొమ్మిది గంటలకే బండి కడతాము. ఒక్క రెండు, మూడు  నిమిషాల వ్యవధిలో  పోటాపోటీగా ఇద్దరం బండి నడుపుతాం" అని అనడంతో వారిద్దరూ విస్తుపోయారు.అందుకే కొన్ని సంఘటనలు మనలను ఆశ్చర్య పరుస్తాయి.
కామెంట్‌లు